టీడీపీ కలికిరి మండల నూతన అధ్యక్షులుగా కేఎస్ షాబుద్దీన్ నియామకం
టీడీపీ కలికిరి మండల నూతన అధ్యక్షులుగా కేఎస్ షాబుద్దీన్ ను పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంగళవారం నియమించారు.కలికిరి మండలం పల్లవోలు పంచాయతీ గడి గ్రామానికి చెందిన కేఎస్ షాబుద్దీన్ వారి తల్లిదండ్రుల కాలం నుంచి నల్లారి కుటుంబానికి మంచి విధేయులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇదిలా ఉండగా పార్టీ నియమావళి ప్రకారం 7సం. పూర్తి చేసుకున్న పార్టీ అధ్యక్షులు మార్పు అనీవార్యం కావడంతో కలికిరి మండలం అధ్యక్ష స్థానం కాలీ కాగా ఆ స్థానంలో నూతన మండలాధ్యక్షులుగా కేఎస్ షాబుద్దీన్ ను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియమించారు