రాయదుర్గం: కణేకల్లు లో గ్రానైట్ బండలు మీదపడి తీవ్రంగా గాయపడిన కూలీ
గ్రానైట్ బండ్లు లోడు దించుతుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ బండ్లు మీద పడడంతో కణేకల్లు లో సలాం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మద్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.