భీమడోలులో ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదినోత్సవ వేడుకలు
Eluru Urban, Eluru | Sep 17, 2025
ఏలూరు జిల్లా భీమడోలులో ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదినోత్సవ వేడుకలు బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు స్థానిక భవిత స్కూల్ ఆవరణలో బీజేపీ నాయకులు కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేసారు. భవితా స్కూల్ విద్యార్థులకు భోజనాన్ని అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శేషగిరి, ప్రత్తి మదన్, మూర్తి, పటేల్, అనిల్ రాజు, ధర్మరావు, యుగంధర్, కే ప్రసాద్ పాల్గొన్నారు.