కర్ణాటక నాగేపల్లిలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలోని కర్ణాటక నాగేపల్లిలో బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మక్బుల్ హుస్సేన్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం విద్యార్థులు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు నిర్వహించారు. వీధులు అపరిశుభ్రంగా ఉండటంతో ఆ వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీరాములు విజ్ఞప్తి మేరకు శుభ్రం చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.