నందివాడ, బాపులపాడు మండలాల్లో ఆక్వా సాగు చేస్తున్న ఫిష్ ట్యాంకులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Machilipatnam South, Krishna | Sep 14, 2025
ఆక్వా రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక నందివాడ, బాపులపాడు మండలాల్లో పర్యటించి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు చేస్తున్న ఫిష్ ట్యాంకులను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ నందివాడ మండలం అరిపిరాల గ్రామం, అనంతరం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో రైతు కుమార్ రాజు తాను స్వయంగా తయారు చేసుకున్న పరికరాలతో చేపలకు మేత వేసే వినూత్న పద్ధతిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.