పిఠాపురం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవలు ముందుంటుంది పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రపురం
ప్రజలకు దేశానికి సేవ చేయడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎప్పుడు ముందుంటుందని పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు తెలియజేశారు . కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో ఆదివారం ఉదయం ఆర్ఎస్ఎస్ పిఠాపురం శాఖ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ యూనిఫారాలను రామచంద్రరావు శ్రీపాద లక్ష్మణరావు చేతుల మీదుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.