మేడ్చల్: మైసమ్మగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రోన్ రోబోటిక్ హబ్ ను ప్రారంభించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రోన్ మరియు రోబోటిక్ హబ్ సెంటర్ ఫర్ యు ఏ వి అండ్ రోబోటిక్స్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించారు. అలాగే డ్రోన్ ఎక్స్పో ప్రారంభించి కాసేపు డ్రోన్ ఫ్లై చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యా సంస్థల సెక్రటరీ చామకూర మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.