మంత్రాలయం: గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీ మఠం వేద పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం , శ్రీ మఠం లో ఉద్యోగం
మంత్రాలయం :శ్రీ మఠం వేద పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆర్థిక సహాయం అందజేశారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేద పాఠశాల విద్యార్థులకు ప్రమాదం జరిగిన రోజు పీఠాధిపతి ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు శుక్రవారం ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల నగదుతో పాటు విద్యార్థి కుటుంబంలో ఒకరికి శ్రీ మఠంలో ఉద్యోగ అవకాశం కల్పించారు.