గ్రానైట్ వ్యాపారుల వద్ద జీవి ముడుపులు తీసుకుంటున్నారు : వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడటం జరిగింది. వినుకొండ మండలం గోకనకొండ ఉమ్మడివరం గ్రామాలలో గ్రానైట్ వ్యాపారులను అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఆ వ్యాపారాల నుంచి ముడుపులు అందుకుంటున్నారని బొల్లా ఆరోపించారు. ప్రజల అన్ని గమనిస్తున్నారని కచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారంటూ పేర్కొన్నారు.