స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ పై హైకోర్టు విధించిన స్టేను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం లోని చక్రపురం చౌరస్తా వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయం కోసం బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని నేతలు పిలుపునిచ్చారు.