రామాయంపేట సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, మహాత్మా జ్యోతిభా ఫూలే పాఠశాలలను అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు.నియోజకవర్గం లోని ప్రభుత్వ సంక్షేమ గురుకులాను సందర్శించి అక్కడి మౌలిక వసతులపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో రికార్డులు, మెనూని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఉన్నతమైన విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.