పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద తమిళనాడు బస్సును అడ్డుకున్న ప్రయాణికులు
తమిళనాడు బస్సును అడ్డుకున్న ప్రయాణికులు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. చెన్నైకి వెళ్లాల్సిన భక్తులు బస్సుల కోసం నిరీక్షించి ఆగ్రహానికి గురయ్యారు. తమిళనాడుకు చెందిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు తమిళనాడు బస్సును అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకునే వారు కరవైనారని ఆవేదన చెందారు.