అనంతపురం జిల్లా సొరకాయల పేట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాలవ్యాను ఇద్దరికీ తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండలం సొరకాయల పేట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని పాల వ్యాన్ ఢీకొన్న ఘటనలో సొరకాయల పేట గ్రామానికి చెందిన రామన్న మరియు ప్రతాపరెడ్డి అనే ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.