అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పిలేపల్లి లో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ నరేంద్ర అనే వ్యక్తి ఇంటిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.