అసిఫాబాద్: రెబ్బెన తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీస్ కళా బృందం
రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాలలో మంగళవారం జిల్లా పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాలబాలికలు చదువుపై దృష్టి సారించి, క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందన్నారు. పెద్దలు చెప్పినట్టుగా కష్టం చేసిన వారెన్నడూ చెడిపోరని కళా బృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ సంజయ్,ఎస్ఐ వెంకట కృష్ణ, కళాబృందం సభ్యులు ఉన్నారు.