కొండపి: సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాలలోని దీపావళి టపాసుల దుకాణాలను పరిశీలించిన ఒంగోలు డివిజన్ డిఎస్పి శ్రీనివాసరావు
జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగలు జరుపుకోవాలని ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాలలోని దీపావళి మందు సామాగ్రి విక్రయించే దుకాణాలను డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. దుకాణాల వద్ద భద్రత ప్రమాణాలు పరిశీలిస్తున్నారా లేదా అని సంబంధిత సిబ్బందితో మాట్లాడి అలానే పరిశీలించి చూశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.