దర్శి: రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం కనిగిరి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి స్వామి కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ప్రకాశం జిల్లాపై సీఎం చంద్రబాబుకు ఎంతో మక్కువ ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగుల కు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్రంలో వర్చువల్ గా సీఎం చంద్రబాబు ఎంఎస్ ఎంఈ 50 పార్కులను ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు.