శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివ స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.క్యూ లైన్లలో భారీగా భక్తులు నిలిచిపోయారు.గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి రావడంతో శివ స్వాములు అసహనానికి గురయ్యారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని దేవస్థానం అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్ల వద్ద తోపులాట, బారికేడ్లు తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు సరిగా లేవని ఆరోపిస్తూ కొంతమంది శివ స్వాములు క్యూ లైన్లను దాటి బయటకు వచ్చారు. కొన్ని చోట్ల గేట్ల తాళాలు పగులగొట్టి, బారికేడ్లు ఊపుతూ నిరసన తెలిపారు.“ఈఓ డౌన్ డౌన్” నినాదాలు చేశారు.