పత్తికొండ: వెల్దుర్తిలో బొలెరో కారు ఢీకొని ముగ్గురికి గాయాలు
పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి జాతీయ రహదారిపై బొలెరో క్యాంపర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన కార్తీక్, హరి (డ్రైవర్)తో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరుకు ఎండు మిరప లోడ్‌తో వెళ్తున్న బొలెరోను వెనుక నుండి వచ్చిన కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన శుక్రవారం జరిగింది. ప్రమాదంలో కారులో చిక్కుకున్న వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది బయటకు తీసి కర్నూలు ఆసుపత్రికి తరలించారు.