బండి ఆత్మకూరు వద్ద కుందూ నదిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం, కాపాడిన యువకులు
Nandyal Urban, Nandyal | Nov 11, 2025
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామం వద్ద మంగళవారం కుందూ నదిలో లింగాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు అంబటి ఈశ్వరమ్మ అనారోగ్య కారణాలతో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న స్థానిక యువకులు ఫిదా, సూరజ్, శీను వెంటనే గమనించి ఆమెను కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఈశ్వరమ్మను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సాహసం చేసిన యువకులను ఏఎస్ఐ అక్బర్ అభినందించారు.