సూపర్ జిఎస్టి కంటే కూడా సోలార్ విద్యుత్ మెరుగైనది.ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Oct 18, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కాపు కల్యాణమండపం నందు “ సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ “ లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి విద్యుత్తును ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీ పథకాలను అందజేస్తుందని వాటిని ప్రజలందరూ తెలుసుకొని వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని తెలియజేశారు