అనపర్తి: ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి- అనపర్తి సీఐ శివ గణేష్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు అనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినిగించుకోవచ్చని ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించే వారికి తగిన చర్యలు తప్పవని సందేశం ఇస్తూ కవాతు నిర్వహించారు.ఎన్నికల సమయంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.