గిద్దలూరు: నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వెల్లడి
నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు అన్నారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని సరైన ధృవపత్రాలు కలిగి ఉండి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని అలానే ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు వారు హెల్మెట్ ధరించడంతోపాటు వెనక కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో ఎస్సై మాట్లాడారు.