యర్రగొండపాలెం: అనారోగ్య సమస్యలతో కంభంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని పూసల బజారులో ఆదివారం అనారోగ్య సమస్యలతో రాజా అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగిన క్రమంలో రాజా పరిస్థితి విషమంగా ఉండగా కుటుంబ సభ్యులు అతనిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ రాజా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.