పులివెందుల: మెడికల్ కాలేజీలను నిర్వహించలేని చేతకాని ప్రభుత్వం : పులివెందులలో YCP కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శ
Pulivendla, YSR | Sep 15, 2025 పులివెందుల మెడికల్ కాలేజీని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా, ప్రస్తుత ప్రభుత్వంపై వారు బహుముఖంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా పేదలకు ఉచిత వైద్య విద్యను, అందుబాటులో ఉన్న వైద్యం అందించే అవకాశాన్ని ప్రభు త్వం తీసుకుంటోందని ఆరోపించారు. పులివెందుల మెడికల్ కాలేజీ అనుమతులు రద్దయిన విషయం, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చేసిన నిర్ణయంపై కూడా YSRCP నాయకులు తీవ్రంగా స్పందించారు. వారు ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పేదల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు.