ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో వాహనదారులకు పోలీసులు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తల వాహనాలకు లేదా రోడ్డుకు తగిలి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందే అవకాశం ఉందని కాబట్టి వాహనదారులు ఇది గుర్తించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. లేదంటే జరిమానాలు తప్పవని సింగరాయకొండ ఎస్సై వాహన దారులను హెచ్చరించారు.