కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని అట్లూరు మండలం అట్లూరు క్రాస్ రోడ్ లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అట్లూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి రమణయ్య, అయ్యప్ప స్వామి భక్తులు మాట్లాడుతూ నిన్నటి దినం అయ్యప్ప గురు స్వామి నరసింహారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని,గత 20 సంవత్సరాలు నుండి అట్లూరు క్రాస్ రోడ్లో అయ్యప్ప స్వామి గుడి నిర్మించి అక్కడే పూజా పురస్కారాలు నిర్వహిస్తున్నారన్నారు.