రాయదుర్గం: పులకుర్తి, హొసగుడ్డం, మల్లికేతి గ్రామాలలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు డి. హీరేహల్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మండల అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, సోమలాపురం సర్పంచ్ లు సుదర్శన్ రెడ్డి, మల్లికార్జున, అంజనయ్య, ఎంపిటిసి శివలింగప్ప, తాలుకా బూత్ కమిటీ అంజిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి సందీప్ కుమార్, యూత్ అధ్యక్షులు హనుమంతరెడ్డి తదితరులు ఆదివారం సాయంత్రం పులకుర్తి, హొసగుడ్డం, మల్లికేతి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు వారి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా తమకు తల్లికి వందనం, రైతు భరోసా పడలేదని చెప్పారు. వాలంటీర్లు తమ ఇంటి వద్దకు వచ్చేవారన్నారు.