ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ మెకానిక్ దుకాణంలో మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది హుటా హుటిన అక్కడికి చేరుకొని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 5 నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగిందని మెకానిక్ షాపు యజమాని తెలిపారు