గిద్దలూరు: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దంటూ గిద్దలూరు పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టిన వైసిపి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దంటూ వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం వల్ల పేదలు విద్యా వైద్యం కోల్పోతారని కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి నిర్వహణ ప్రభుత్వమే నిర్వహించాలని కుందూరు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.