ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఎంపికలో అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేయాలని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో TNSF నేతల ఫిర్యాదు
Eluru, Eluru | Apr 1, 2024 APPSC అభ్యర్థులు ఎంపికలో అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి, ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని జిల్లా TNSF, తెలుగు యువత ఆధ్వర్యంలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. "ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టును రెండు కోట్ల 50 లక్షలకు, డీఎస్పీ పోస్టును కోటి 50 లక్షలకు అమ్ముకున్నారు. 30 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 25 డీఎస్పీ పోస్టులను అక్రమంగా భర్తీ చేశారు. 150 కోట్ల కుంభకోణం జరిగింది" అని టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు.