సిర్పూర్ టి: పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కారు - ఆటో డీ, పలువురికి తీవ్ర గాయాలు
పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వెళ్తున్న కారును పోలీస్ స్టేషన్ సమీపంలోని గల్లి నుండి ఒకసారిగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో కారు, ఆటో ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,