మార్కాపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి విరమించాలని ప్రభుత్వాన్ని కోరిన పరిరక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రమేష్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య శాంతిభవన్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిరక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైద్యాన్ని వ్యాపారంగా మార్చారని, కార్పొరేట్ వైద్య వ్యయం ప్రజల్ని అప్పులపాలు చేస్తుందని వివరించారు. విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని ప్రైవేటు పరం చేస్తే ధనస్వామ్యంగా మారుతుంది అన్నారు.