పైన పటారం - లోన లొటారం
- ఎమ్మెల్యే వస్తున్నారని సూళ్లూరుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి గోడలకు ముసుగేసిన వైద్యులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరుకొని ఉంది. ఇక్కడ OP చూసే చోట పై స్లాబ్ పెచ్చులు ఊడి పడిపోతుంది. అలాగే ఆసుపత్రి లోపల గోడలు కూడా పెచ్చులు ఊడి పడిపోతున్నాయి. ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది. బుధవారం ఈ భవనంలో ఎక్సరే మిషన్ ప్రారంభించడానికి MLA విజయశ్రీ వస్తున్నారని పెచ్చులు ఊడి పడిపోతున్న గోడలు కనిపించకుండా గోడలకు ముసుగులు వేశారు. కొద్దిగా ముసుగు తీసి చేస్తే పెచ్చులు ఊడి పడిపోయిన గోడలు కనిపించాయి, చేతులు కాలే వరకు చూడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఆసుపత్రి సిబ్బందికి, ఇక్కడికి వచ్చే రోగులకు రక్షణ ఉంటుందని పలువురు కోరారు.