పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
శ్రీకాళహస్తిలో RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి శ్రీకాళహస్తి శ్రీరామ నగర్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన మునిరెడ్డి శ్రీకాళహస్తిలో గత 12 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆదివారం యధావిధిగా ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతుండగా RTC బస్సు ఢీకొంది. ఏరియా హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.