సమాజంలోని అవినీతి, అక్రమాలను వెలికి తీసి ప్రజలను చైతన్యవంతం చేసే జర్నలిస్టులను అందరూ గౌరవించాలని రాయల చెరువు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ శెట్టి అన్నారు. యాడికి మండలం రాయలచెరువులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సుమారు పదిమంది జర్నలిస్టులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టులను గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించినట్లేనన్నారు. జర్నలిస్టులు సేవలు మరువలేని వన్నారు.