ఏలూరు జిల్లావ్యాప్తంగా దేవిశరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా మండల వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకటలాడాయి. స్థానిక ద్వారకాతిరుమల శ్రీకుంకులమ్మ ఆలయం, బువనపల్లి శ్రీ వడలమ్మ ఆలయాల్లో మహిళలు విశేష పూజలు చేసారు. భీమడోలు దిగుడుపాటిదిబ్బ బృందావన్ కాలనీలో అమ్మవారి సంబరం వైభవంగా నిర్వహించారు. శ్రీకనకదుర్గమ్మ మండపం వద్ద అమ్మవారు, పోతురాజుబాబుకు సంబరం చేశారు. ఈ మేరకు స్థానిక మహిళలు 101 బిందెలతో అమ్మవారికి, గణాచారులకు జలాభిషేకం చేశారు. ఎంఎం పురం గ్రామంలో భక్తులు నిప్పులుగుండం నిప్పులు పై తొక్కి భక్తి చాటుకున్నారు.