ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం 565 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని పెద్దపులి మృతి చెందిన విషయం తెలిసినదే. సమాచారం అందుకున్న మార్కాపురం టైగర్ ప్రాజెక్టు డైరెక్టర్ అబ్దుల్ రావుఫ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పెద్దపులి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్ కి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయినట్లుగా పోస్టుమార్టం నివేదికలో తేలింది అన్నారు. పులి మృతదేహాన్ని దహనం చేశామన్నారు.