లోక్ అదాలత్ కేసులను పరిష్కారం చేయడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డిని జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో శివగంగాధర్ రెడ్డికి ఎస్పీ అవార్డును ప్రదానం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డులను పొందాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు.