కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. గూడూరు మండలం గొల్లపల్లి సమీపంలో కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి శనివారం రాత్రి వైభవంగా పల్లకి సేవ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని పల్లకి మోసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.