పరిగి మండలంలో బోల్తాపడ్డ కారు.. పలువురికి గాయాలు
శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం హైవే రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వివాహం నిమిత్తం హిందూపురానికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైవే వద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఓ చిన్నారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.