అసిఫాబాద్: మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి:జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
జిల్లాలోని మారుమూలకు ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్, ధోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఒప్పంద ప్రాతిపదికన ఇటీవల నియమించబడిన 13 మంది వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో 13 మంది వైద్యులను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.