శ్రీశైలంలో క్యూ లైన్స్ వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పర్శ దర్శనం టికెట్ల జారీపై ఆలయ అధికారుల నిర్లక్ష్యం భక్తులను విసిగిస్తోంది. సామర్థ్యానికి మించి స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేయడంతో, క్యూలైన్ల వద్ద వేచి ఉండాల్సిన సమయం భారీగా పెరిగిపోయింది. సాయంత్రం 7 గంటల టికెట్లు తీసుకున్న భక్తులు, రాత్రి 11 వరకు కూడా క్యూలోనే నిలబడి ఉన్నారు. 9 గంటల టికెట్ల దర్శనం పూర్తయ్యే సమయానికి రాత్రి 12 గంటలు దాటే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. స్పర్శ దర్శనం కోసం గంటల తరబడి నిలబెట్టడం తమపై అన్యాయమని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.