అధ్వానంగా ఓజిలి మండల గ్రామ రహదారులు
- తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు
తిరుపతి జిల్లా ఓజిలి మండలం మాచవరం నుంచి నాయుడుపేట మండలం కోనేటిరాజుపాలెం వెళ్ళే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వాన్నంగా మారింది. భారీ టిప్పర్ల రాకపోకలతో రహదారి పూర్తిగా ధ్వంసం అయిన నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధ్వంసం అయిన రహదారిలో గుంతలు ఎక్కడ ఉన్నాయో గుర్తించలేక ప్రమాదాల బారిన పడి ద్విచక్ర వాహనదారులు గాయాల పాలవుతున్నారు. ప్రధానంగా ముమ్మాయిపాలెం, మాచవరం, తిరుమలపూడి, వీర్లగునపాడు, జయంపు తదితర గ్రామాలకు వెళ్ళే ప్రజలు రహదారి గోతులలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. శుక్రవారం ఈ మార్గంలో వెళుతూ ఓ బైకిస్ట్ అదుపుతప్పి కిందపడి గాయాల ప