శ్రీశైలంలో అన్యమత ప్రచారం, మరియు మద్యం, మాంసం అరికట్టేందుకు విజిలెన్స్ ఏర్పాటు: ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్
శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు అధ్యక్షన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ నక్షత్రవనంలో 150 అడుగుల అర్థనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు చెంచుగూడాలలో విరివిగా ధర్మప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించామన్నారు, శ్రీశైలక్షేత్ర పరిరక్షణలో భాగంగా దేవదాయశాఖ నియమనిబంధనలను అనుసరించి క్షేత్రపరిధిలో అన్యమత ప్రచారం జరగకుండా చూసేందుకు, క్షేత్రంలో మద్యం,మాంసం మొదలైన నిషేధిత వస్తువులు రాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా దేవస్థానం అధికారులతో విజిలెన్సు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.