అనంతపురం నగరంలోని కెవిఎస్ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కెవిఎస్ కాలనీకి చెందిన సిద్దయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.