కర్నూలు: గోరంట్ల అంగన్వాడీ కేంద్రం పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన: కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి
కోడుమూరు మండలం అంగన్వాడీ కేంద్రం పని తీరు పట్ల జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమా ను విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఐసీడీఎస్ పిడి విజయను ఆదేశించారు. బుధవారం ఉదయం 10 గంటలకు కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ , పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు తదితర పదార్థాలను, రిజిస్టర్ లను పరిశీలించారు.