కోడుమూరు: పెంచికలపాడు టీడీపీ నాయకుడి కుమార్తె వివాహ శుభకార్యానికి హాజరైన ఎంపీ బస్తిపాటి నాగరాజు, డైరెక్టర్
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగ సుంకన్న కూతురు వివాహానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట రాముడు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి పెద్దలనుంచి వారికి సాదర స్వాగతం లభించింది. ఎంపీ, డైరెక్టర్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.