నగరి: వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ సమీపంలో హైవేపై ప్రమాదం
తిరుపతి–చెన్నై జాతీయ రహదారిపై వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నుంచి చెన్నై వైపు వెళ్తున్న గ్యాస్ లారీని వెనక నుంచి కూరగాయల ఐచర్ లారీ ఢీకొట్టింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్‌కు చేతులు, కాళ్లు విరిగాయి. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.