కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు తరలి వస్తున్నాయి: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి బడా కంపెనీలు సైతం తరలి వస్తున్నాయని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు.కళ్యాణదుర్గంలో గాలి మరల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మాట్లాడారు.మూడు కంపెనీలు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు.కంపెనీలు ఏర్పాటు అయితే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్క కంపెనీ కూడా రాలేదన్నారు.